ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ | sathyasai giri pradakshina in puttaparthy | Sakshi
Sakshi News home page

ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ

Sep 16 2016 11:20 PM | Updated on Sep 4 2017 1:45 PM

ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ

ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ

సత్యసాయి గిరి ప్రదక్షిణను భక్తులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భక్తులు గిరిప్రదక్షిణ చేపట్టారు.

పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయి గిరి ప్రదక్షిణను భక్తులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భక్తులు గిరిప్రదక్షిణ చేపట్టారు. సాయంత్రం ప్రశాంతి నిలయం గణేష్‌ గేట్‌ వద్ద సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలాపనతో గిరిరథాన్ని లాగుతూ భక్తులు ముందుకు సాగారు.

గోకులం, ఎనుములపల్లి గణేష్‌ సర్కిల్, ఆర్‌వీజేæ పెట్రోల్‌ బంక్, చింతతోపుల మీదుగా పట్టణంలో ప్రవేశించి తిరిగి గణేష్‌ గేట్‌ వద్ద మంగళహారతితో ముగించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement