ఎక్సైజ్ శాఖకు ఇ¯ŒSఫార్మర్‌గా వ్యవరిస్తున్నాడన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు 52 ఏళ్ళ ఉండవల్లి సత్యనారాయణను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పథక రచన చేసినది ఓ మహిళ కావడం విశేషం. వివరాలను పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, సిఐ
మహిళ ప్రోద్బలంతోనే సారా ఇన్ఫార్మర్ హత్య
Jan 8 2017 10:57 PM | Updated on Sep 5 2017 12:45 AM
పెద్దాపురం :
ఎక్సైజ్ శాఖకు ఇ¯ŒSఫార్మర్‌గా వ్యవరిస్తున్నాడన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు 52 ఏళ్ళ ఉండవల్లి సత్యనారాయణను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పథక రచన చేసినది ఓ మహిళ కావడం విశేషం. వివరాలను పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, సిఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్‌లు ఆదివారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. కట్టమూరు గ్రామానికి చెందిన ఉండవల్లి సత్యన్నారాయణ (52) గ్రామంలో సారా విక్రయాలు జరుగుతున్నాయంటూ తరచూ ఎక్సైజ్ అధికారులకు సమాచారమిస్తూ గ్రామానికి చెందిన చిట్టూరి లక్ష్మి, చింతాకుల సత్తిబాబు, రాయుడు వీరబాబులను వేధించేవాడు. దీంతో విసుగు చెందిన లక్ష్మి వారిరువురుతో పాటు హరిజనపేటకు చెందిన బలిపే అర్జు¯ŒSతో కలిపి సత్యనారాయణను హతమార్చాలని పథకం పన్నారు. దీంతో గత నెల 31వ తేదీ రాత్రి సత్యన్నారాయణను పార్టీ చేసుకుందాం రమ్మని ఫో¯ŒS చేసి ఘటనా స్థలానికి తీసుకువెళ్లి వెనుక నుంచి రాడ్‌తో బలంగా కొట్టి చంపి, పక్కనే ఉన్న క్వారీ గోతిలో కప్పేశారు. అలాగే అతడి బైక్‌ను పక్కనే ఉన్న చెరువులో పడేసి పరారయ్యారు. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఎస్సై వై.సతీష్ కేసు దర్యాప్తు ప్రారంభించగా గ్రామానికి చెందిన సారా నిందితులపై అనుమానంతో విచారించగా అసలు మిస్టరీని వివరించినట్లు డీఎస్పీ రాజశేఖరరావు తెలిపారు. వారిపై ఎక్సైజ్ కేసులున్నాయని, ముద్దాయిలుగా ఉన్న వీరు సారా విక్రయాలకు అడ్డుపడుతున్నాడన్న అక్కస్సుతోనే హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. వారం రోజుల్లో కేసును ఛేదించిన సీఐ వీరయ్యగౌడ్, ఎస్‌ఐలు సతీష్, ఏసుబాబు, వలీ, హెచ్‌సిలు వై.కృష్ణ, కుమార్, గణేష్, భూషణంరెడ్డి, శ్రీనివాసరావు, జయకుమార్, విజయ్‌లను అభినందిస్తూ జిల్లా ఎస్పీ వారికి రివార్డులు ప్రకటించారు.
Advertisement
Advertisement