నగరంలో హజ్‌హౌస్ మల్లిపుల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరైనట్లు కర్నూలు నగర ముస్లిం మైనార్టీ జాయింట్ యాక‌్షన్ కమిటీ అధ్యక్షులు మౌలానా జుబేర్ వెల్లడించారు.
హజ్‌హౌస్ కాంప్లెక్స్‌కు రూ.3 కోట్లు
Oct 31 2016 11:50 PM | Updated on Sep 4 2017 6:48 PM
ముస్లిం మైనార్టీ జాయింట్ యాక‌్షన్ కమిటీ అధ్యక్షుడు మౌలానా జుబేర్
కర్నూలు (టౌన్): నగరంలో హజ్‌హౌస్ మల్లిపుల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరైనట్లు కర్నూలు నగర ముస్లిం మైనార్టీ జాయింట్ యాక‌్షన్ కమిటీ అధ్యక్షులు మౌలానా జుబేర్ వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 29న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి ముస్లిం మైనార్టీ జాయింట్‌యాక‌్షన్ కమిటీ నాయకులు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గణేష్‌నగర్‌లో మసీదు నిర్మాణానికి రూ.17 లక్షలు, ఈద్గా ఏర్పాటుకు 10 ఎకరాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు నగరంలో నాలుగు ముస్లింల శ్మశానవాటికల అభివృద్ధి కోసం రూ.1.80 కోట్లు, పాత ఈద్గా మరమ్మతులు రూ.35 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. సమావేశంలో జాయింట్ యాక‌్షణ్ కమిటీ ఉపాధ్యక్షుడు మౌలానా జాకీర్, మౌలానా జబీర్, సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ, షఫి అహ్మద్‌ఖాన్, బషీర్ అహ్మద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement