కొవ్వూరుపాడు(గోపాలపురం) : మండలంలోని కొవ్వూరుపాడులో ఓ ఇంటిలో దొంగలు పడి రూ. 30 వేలు నగదు, ఇతర సామన్లు దోచుకుని ఆనక ఇంటిని తగులబెట్టిన ఘటన కొవ్వూరుపాడులో గురువారం రాత్రి జరిగింది.
ఇల్లు దోచుకుని తగులబెట్టారు
Aug 27 2016 2:28 AM | Updated on Aug 30 2018 5:27 PM
కొవ్వూరుపాడు(గోపాలపురం) : మండలంలోని కొవ్వూరుపాడులో ఓ ఇంటిలో దొంగలు పడి రూ. 30 వేలు నగదు, ఇతర సామన్లు దోచుకుని ఆనక ఇంటిని తగులబెట్టిన ఘటన కొవ్వూరుపాడులో గురువారం రాత్రి జరిగింది. వివరాలివీ.. గ్రామానికి చెందిన బుద్దాల రాంబాబు కుమార్తె వివాహం ఇటీవల కుదిరింది. తాడేపల్లిగూడెంలో జరిగిన వివాహానికి గురువారం రాంబాబు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లారు. గురువారం రాత్రి దొంగలు రాంబాబు ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలో దాచిన రూ రూ.30 వేలు దోచుకుపోయారు. వెళ్తూ.. వెళ్తూ.. వారు తాటాకింటికి నిప్పుపెట్టారు. కుమార్తె వివాహం అనంతరం ఇంటికి చేరిన రాంబాబు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు రాంబాబు తెలిపారు.
Advertisement
Advertisement