తెగిన తాత్కాలిక రోడ్డు | road damage | Sakshi
Sakshi News home page

తెగిన తాత్కాలిక రోడ్డు

Aug 2 2016 6:39 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో దిగువన ఉన్న గోదావరి ఏడారిగా మారడంతో పలు ప్రాంతాలకు గోదావరిలో నుంచి రహదారులు ఏర్పాటు చేసుకున్నారు.

రామగుండం : ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో దిగువన ఉన్న గోదావరి ఏడారిగా మారడంతో పలు ప్రాంతాలకు గోదావరిలో నుంచి రహదారులు ఏర్పాటు చేసుకున్నారు. అంతర్గాం రైల్వే వంతెన పక్కన మరో వంతెన నిర్మాణం కొనసాగుతుండడంతో సదరు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధులు నిర్మాణ పనుల నిమిత్తం గోలివాడ–మంచిర్యాల వరకు భారీ వాహనాలు ఇరువైపుల తిరిగేందుకు రహదారి నిర్మించారు. ఈ మార్గం గుండా రామగుండం నుంచి మంచిర్యాలకు కేవలం 13 కిలో మీటర్లు మాత్రమే ఉండడంతో మండల పరిధితో పాటు పట్టణ ప్రజలు సుమారు పది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడంతో రద్దీ పెరిగింది. దీనిని ఆటోవాలాలు, ఇతర టాక్సీలు వినియోగించుకోవడంతో డీజీల్‌ వినియోగం తగ్గింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇరువైపుల వివిధ కాలనీల నుంచి వచ్చే వరద నీరు గోదావరినదిలో కలువడంతో వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement