కదిలించిన ‘సాక్షి’ ఫొటో | revard for police constable | Sakshi
Sakshi News home page

కదిలించిన ‘సాక్షి’ ఫొటో

Aug 19 2016 12:31 AM | Updated on Mar 19 2019 5:52 PM

కదిలించిన ‘సాక్షి’ ఫొటో - Sakshi

కదిలించిన ‘సాక్షి’ ఫొటో

కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కర ఘాట్‌లో ఓ దివ్యాంగుడిని కానిస్టేబుల్‌ తన చేతులతో ఎత్తుకొని ఒడ్డుకు చేరుస్తున్న ఫొటోను గురువారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది.

– వికలాంగునికి చేయూతనిచ్చిన కానిస్టేబుల్‌కు అవార్డు
– రూ.5,016 రివార్డు ప్రకటించిన డీజీపీ
 
శ్రీశైలం: కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కర ఘాట్‌లో ఓ దివ్యాంగుడిని కానిస్టేబుల్‌ తన చేతులతో ఎత్తుకొని ఒడ్డుకు చేరుస్తున్న ఫొటోను గురువారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఈ దశ్యం డీజీపీ సాంబశివరావును కదిలించింది. కానిస్టేబుల్‌ సేవలను ప్రశంసిస్తూ గురువారం ఆయన రివార్డు ప్రకటించారు. డీజీపీ ఆదేశాల మేరకు రాయలసీమ జిల్లాల ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకెరవికష్ణ, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజలు గురువారం ఉదయం స్వయంగా లింగాలగట్టు దిగువ ఘాటుకు చేరుకొని పుష్కర విధుల్లోని కానిస్టేబుల్‌ మధుకుమార్‌ను అభినందించి రూ.5,016 నగదు రివార్డును అందజేశారు. మధుకుమార్‌(పీసీ 229) కోసిగి మండల పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్నారు. గతంలో మంత్రాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనూ ఈయన అవార్డును అందుకోవడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement