నదుల అనుసంధానంతోనే కరువుకు చెక్‌ | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానంతోనే కరువుకు చెక్‌

Published Sat, Aug 20 2016 11:49 PM

retired chief engineer statement on river link system

విడపనకల్లు: నదుల అనుసంధానం ద్వారా కరువును శాశ్వతంగా పాలద్రోలవచ్చని రిటైర్డ్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ టీబీ రవి అన్నారు. శనివారం ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నదుల అనుసంధానంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నదులు అనుసంధానం చేయడం ద్వారా గోదావరి నది ద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీల జలాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. 


నదుల అనుసంధానం ద్వారా భూగర్బ జలాలు పెరగడమే కాకుండా పరిశ్రమలు కూడా ఎక్కువ వస్తాయని తెలిపారు. తద్వారా ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.  అనంతరం విద్యార్థులు నదుల అనుసంధానంపై అడిగిన పలు సందేహాలకు అడిగి నివృతి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రామచంద్రమూర్తి, వైస్‌ ప్రిన్పిపాల్‌ వేణుగోపాల్‌రెడ్డి, అధ్యాపకులు ఓబుళేసు, మిద్దె మల్లికార్జున, కిరణ్, సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement