రిటైర్ట్‌ పోలీసులకు బోధకులుగా అవకాశం | retaired police as teachers | Sakshi
Sakshi News home page

రిటైర్ట్‌ పోలీసులకు బోధకులుగా అవకాశం

Jun 1 2017 12:52 AM | Updated on Sep 5 2017 12:28 PM

ఆసక్తి ఉన్న రిటైర్డ్‌ పోలీసులు.. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో తరగతులు బోధించవచ్చని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు.

– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ
కర్నూలు: ఆసక్తి ఉన్న రిటైర్డ్‌ పోలీసులు.. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో తరగతులు బోధించవచ్చని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. జిల్లాలో ఎనిమిది మంది పోలీసు అధికారులు బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎస్పీ ఆకె రవికృష్ణ ఆధ్వర్యంలో ‘మన కుటంబం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐలు పి.జాన్‌ (నందికొట్కూరు), పి.పుల్లయ్య (నంద్యాల ట్రాఫిక్‌), కె.విశ్వనాథ్‌ (ఆదోని ట్రాఫిక్‌), అబ్దుల్‌హక్‌ (నంద్యాల ట్రాఫిక్‌), ఏఎస్‌ఐలు డీఎల్‌ దస్తగిరి (ఉలిందకొండ పీఎస్‌), సి.ప్రసాదరావు (డీసీఆర్‌బీ), కేవీ సుబ్బయ్య (కర్నూలు పీసీఆర్‌), ఆర్‌ఎస్‌ఐ ఎస్‌ మహమూద్‌ (ఏఆర్‌ హెడ్‌ క్వాటర్స్‌) తదితరులు పదవీవిరమణ పొందారు. వీరందరినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పిలిపించి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి సూట్‌కేసులను బహుమతులుగా అందజేశారు. ఎస్పీ రవికృష్ణతో పాటు తల్లి ఆకె రత్నమాల, సతీమణి ఆకె పార్వతితో పాటు తదితరులు కార్యక్రమంలో పాల్గొని పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపి భద్రతా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అత్యంత ఒత్తిడితో పనిచేసి ఉద్యోగి పోలీస్‌ అన్నారు. సుధీర్ఘ కాలం పోలీసు శాఖలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు.. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ దంపతులు అల్పాహారం వడ్డించారు. అడిషనల్‌ ఎస్పీ షేక్షావలీ, డీఎస్పీ రమణమూర్తి, ఏఓ అబ్దుల్‌ సలాం, సీఐలు ములకన్న, నాగరాజు యాదవ్, డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, ఆదిలక్ష్మీ, ఆర్‌ఐలు రంగముని, జార్జ్, రామకృష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement