త్వరలో జిల్లాకో గురుకుల డిగ్రీ కళాశాల | residential college for every district | Sakshi
Sakshi News home page

త్వరలో జిల్లాకో గురుకుల డిగ్రీ కళాశాల

Aug 30 2015 10:37 PM | Updated on Sep 3 2017 8:25 AM

త్వరలో జిల్లాకో గురుకుల డిగ్రీ కళాశాల

త్వరలో జిల్లాకో గురుకుల డిగ్రీ కళాశాల

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రతి జిల్లాకు ఒక సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

-గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
డిచ్‌పల్లి: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రతి జిల్లాకు ఒక సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గురుకుల పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గురుకుల కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు పేదరికంతో ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారని, ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement