రికవరీ వ్యాన్‌ అందజేత | Recovery van donate | Sakshi
Sakshi News home page

రికవరీ వ్యాన్‌ అందజేత

Aug 7 2016 9:49 PM | Updated on Sep 4 2017 8:17 AM

రికవరీ వ్యాన్‌ అందజేత

రికవరీ వ్యాన్‌ అందజేత

అర్బన్‌ జిల్లా పరిధిలో ట్రాఫిక్‌ Sనియంత్రణ కోసం పోలీసులకు ఎల్వీఆర్‌ అండ్‌ సన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం రికవరీ వ్యాన్‌ను అందజేశారు.

పట్నంబజారు (గుంటూరు) : అర్బన్‌ జిల్లా పరిధిలో ట్రాఫిక్‌ Sనియంత్రణ కోసం పోలీసులకు ఎల్వీఆర్‌ అండ్‌ సన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం రికవరీ వ్యాన్‌ను అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో క్లబ్‌ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్‌ రూ.19.50 లక్షలు విలువ చేసే ఈ రికవరీ వ్యాన్‌ను అర్బన్‌ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి అందజేశారు. అనంతరం జెండా ఊపి వ్యాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ పోలీసు శాఖకు సహకరిస్తూ రికవరీ వ్యాన్‌ను అందజేయడం సంతోషకరమన్నారు. క్లబ్‌అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ క్లబ్‌ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు జె.భాస్కరరావు, బీపీ తిరుపాల్, ఇ.సుబ్బారాయుడు, డీఎస్పీలు కండె శ్రీనివాసులు, కేజీవీ సరిత, పి.శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement