సికింద్రాబాద్‌కు 'రత్నాచల్' | Ratnachal express moved to Secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌కు 'రత్నాచల్'

Mar 17 2016 8:24 PM | Updated on Sep 3 2017 7:59 PM

కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద జరిగిన హింసాకాండలో దగ్ధమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు గురువారం తుని నుంచి సికింద్రాబాద్ తరలించారు.

తుని : కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద జరిగిన హింసాకాండలో దగ్ధమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు గురువారం తుని నుంచి సికింద్రాబాద్ తరలించారు. ఆనాడు ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి, నిప్పు పెట్టగా రైలులోని 23 బోగీలు, ఇంజన్ కాలిపోయిన సంగతి తెలిసిందే.

ప్రయాణికులు ముందే రైలు దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. దగ్ధమైన రత్నాచల్‌ను ఫిబ్రవరి ఒకటిన తుని రైల్వేస్టేషన్‌కు తరలించి, లూప్‌లైన్‌లో ఉంచారు. రైళ్ల క్రాసింగ్‌కు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం సికింద్రాబాద్ తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement