మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని కంబారాయుడుపేటకు చెందిన వి.షణ్ముఖరావు అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వివాహిత ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అత్యాచారం చేసిన సంఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు వి.షణ్ముఖరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ సీహెచ్ ప్రసాద్ చెప్పారు.
అత్యాచారం కేసు నమోదు
Published Tue, Jul 26 2016 12:03 AM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM
కంబాలరాయుడుపేట (వజ్రపుకొత్తూరు) : మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని కంబారాయుడుపేటకు చెందిన వి.షణ్ముఖరావు అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వివాహిత ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అత్యాచారం చేసిన సంఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు వి.షణ్ముఖరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ సీహెచ్ ప్రసాద్ చెప్పారు.
అదే గ్రామంలోని బాధితురాలి భర్త ఆదివారం సముద్రంలో చేపల వేటకు వెళ్లగా ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళపై బలవంతం చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్‌ఐ చెప్పారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎన్.సన్యాశినాయుడు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్ వివరించారు. నిందితుడు షన్ముఖరావు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement