వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్ | Ranga Reddy district sp Naveen Kumar suspended home guard | Sakshi
Sakshi News home page

వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్

Jul 10 2016 7:34 PM | Updated on Mar 28 2018 11:26 AM

వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్ - Sakshi

వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్

రంగారెడ్డి ఎస్పీ నవీన్‌కుమార్ ఇంట్లో వెట్టిచాకిరీ కేసు కొత్త మలుపు తిరిగింది.

రంగారెడ్డి: రంగారెడ్డి ఎస్పీ నవీన్‌కుమార్ ఇంట్లో 'హోమ్‌గార్డుల వెట్టిచాకిరి' కేసు కొత్త మలుపు తిరిగింది. హోమ్‌గార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్లు వస్తుంటే...కానిస్టేబుల్ మహేశ్నే ఎస్పీ సస్పెండ్ చేశారు. అధికారిక సమాచారాన్ని లీక్ చేశారని సస్పెన్షన్ వేటు వేసినట్టు వెల్లడించారు.

గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్‌చల్ చేయడంతో పోలీస్‌వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

అయితే హోంగార్డులు తన ఇంట్లో పని చేసిన వ్యవహారంలో కుట్రజరిగిందని మహేశ్ అనే కానిస్టేబుల్ పథకం ప్రకారం ఈ పని చేశాడని ఎస్పీ నవీన్ కుమార్ తెలిపారు. దీని పై విచారణ కూడా చేయిస్తామన్నారు. ఇంతలోనే మహేశ్ పై వేటు పడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement