ఎల్బీనగర్‌లో రకుల్‌ | rakul participated in private shop opening | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్‌లో రకుల్‌

Aug 4 2016 9:20 PM | Updated on Jul 23 2019 11:50 AM

ఎల్బీనగర్‌లో రకుల్‌ - Sakshi

ఎల్బీనగర్‌లో రకుల్‌

రకుల్ ప్రీత్ సింగ్ ఎల్బీనగర్ లో ప్రైవేటు షాపు ఓపెనింగ్లో పాల్గొన్నారు.

మన్సూరాబాద్‌: అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురువారం ఎల్‌బీనగర్‌లో సందడి చేశారు. లక్ష్మీ పద్మవంశీ హ్యాండ్లూమ్స్, టెక్ట్స్‌టైల్స్‌ మార్కెట్‌ (ఎల్‌పీటీ) ట్రస్ట్‌ ఆద్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎల్‌పీటీ మార్కెట్‌ను ఆమెతో పాటు ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ ప్రారంభించారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో జాతీయ ర హదారిపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు జెల్ల బిక్షమ్, ఉపాధ్యక్షులు పద్మశ్రీ గజం గోవర్థన్, ప్రధాన కార్యదర్శి కొంగరి లక్ష్మీనారాయణ, కోశాధికారి చెరుపల్లి నర్సింహ, సంయుక్త కార్యదర్శి గండూరి శంకర్, శాశ్వత సభ్యులు గోశిక యాదగిరి, సభ్యులు జెల్ల నర్సింహ, పిల్లలమర్రి అశోక్, రాపోలు రవి, నామని అయోధ్య, జెల్ల గణేష్, గంజి కైలాసం, మహంకాళి శ్రీనివాస్, పున్న శ్రీశైలం, పెద్ది జగదీష్, కోమటి సత్యనారాయణ, పున్న రమణ విశ్వనాథ్, కోట కృష్ణ, తిరందాసు హనుమంతు, పున్న దశరథ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement