రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రజక సహకార సంఘం సొసైటీæ చైర్మన్ రాజమండ్రి నారాయణ తెలిపారు.
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రజక సహకార సంఘం సొసైటీæ చైర్మన్ రాజమండ్రి నారాయణ తెలిపారు. శనివారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను ఎవరూ తిరిగి చెల్లించడం లేదని, ఇలాంటి సమయంలో మళ్లీ రుణాలు ఎలా అందిస్తారన్నారు.
కాగా కాపులపై ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వానికి బీసీలపై లేదని వివిధ సంఘాల నాయకులు చైర్మన్ ముందు వాపోయారు. బీసీలకు అందించాల్సిన రుణాలను అందించకపోవడంపై అధికారుల నిర్లక్ష్య వైఖరిని ముఖ్యమంత్రి దష్టికి, సంబంధిత మంత్రి దష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో వడ్డెర సహకార సంఘం చైర్మన్ దేవళ్ల మురళి, రజక సహకార సంఘం డైరెక్టర్ షణ్ముగం, ఉప్పర సహకార సంఘం డైరెక్టర్ సగర శ్రీకాంత్, దేవేంద్రప్ప, చంద్రమోహన్, లింగమయ్య, కంబన్న, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.