పచ్చనేతల కోసమే రెయిన్‌గన్‌లు | rain guns for tdp leaders | Sakshi
Sakshi News home page

పచ్చనేతల కోసమే రెయిన్‌గన్‌లు

Sep 27 2016 11:02 PM | Updated on Oct 4 2018 4:39 PM

టీడీపీ నేతల జేబులు నింపేందుకే రెయిన్‌గన్‌లను ప్రభుత్వం పంపిణీ చేసిందని, రెయిన్‌ గన్‌ల ద్వారా ఒక్క ఎకరాను కూడా మండలంలో కాపాడ లేక పోయారని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఇందుకూరు నారాయణరెడ్డి విమర్శించారు.

ముదిగుబ్బ : టీడీపీ నేతల జేబులు నింపేందుకే రెయిన్‌గన్‌లను ప్రభుత్వం పంపిణీ చేసిందని, రెయిన్‌ గన్‌ల ద్వారా ఒక్క ఎకరాను కూడా మండలంలో కాపాడ లేక పోయారని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఇందుకూరు నారాయణరెడ్డి విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని మలకవేములక్రాస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

వర్షాభావంతో వేరుశనగ పంట ఎండిపోయిందని,  ఒక్క ఎకరాలో కూడా పంట పండలేకపోయారన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రకటించి ఆదుకుంటారని అందరూ ఆశిస్తే.. రెయిన్‌గన్‌లతో పంటలు కాపాడామని గొప్పలు చెప్పి వెళ్లిపోయారన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతాంగానికి హెక్టార్‌కు రూ.25 వేలు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.నాయకులు ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సేవేనాయక్, భాస్కర్, శివనారాయణ, రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement