ప్రపంచీకరణ వలన సమాజంలో ధనదాహం, మతమౌఢ్యం పెరుగుతున్నాయని, మన సాహిత్యం, సంస్కృతి అన్నీ మునిగిపోతున్నాయని జనవిజ్ఞానవేదిక జిల్లా అ«ధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలి¯ŒS ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజాసాహితి’ మాసపత్రిక
-
డాక్టర్ చెలికాని స్టాలిన్ ఆవేదన
-
‘ప్రజాసాహితి’ 400వ సంచిక ఆవిష్కరణ
రాజమహేంద్రవరం కల్చరల్ :
ప్రపంచీకరణ వలన సమాజంలో ధనదాహం, మతమౌఢ్యం పెరుగుతున్నాయని, మన సాహిత్యం, సంస్కృతి అన్నీ మునిగిపోతున్నాయని జనవిజ్ఞానవేదిక జిల్లా అ«ధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలి¯ŒS ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజాసాహితి’ మాసపత్రిక 400వ సంచికను జనసాహితి ఆధ్వర్యంలో ఆదివారం వి.టి.కళాశాల సమావేశమందిరంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకవర్గసంస్కృతినే ప్రజాసంస్కృతిగా చెలామణి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ సృజనాత్మకతను మింగి వేస్తున్నదన్నారు. ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దేవుడి మీద ఖర్చుపెట్టడం సరికాదని, సొంతసొమ్ము ఎంతయినా ఖర్చుపెట్టుకోవచ్చునని అన్నారు. ప్రజాజీవితంతో సాహిత్యం ముడిపడి ఉండాలని స్పష్టం చేశారు. సభకు అధ్యక్షత వహించిన సిరాజ్ మాట్లాడుతూ రాజుల యుద్ధాలు, శృంగారాలకు బదులు మానవుడే సాహిత్యానికి కేంద్రబిందువు కావాలన్నారు. వేమన, కందుకూరి, గురజాడ, శ్రీశ్రీ వంటి మహనీయులు ప్రజాసాహిత్యానికి బాటలు వేశారన్నారు. ప్రజాసాహితి సంచికల సీడీని తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు సాహిత్యపీఠం డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ఆవిష్కరించారు. డాక్టర్ పాలంకి శోభారాణి ప్రసంగించారు. సాహితీవేత్త దివికుమార్ మాట్లాడుతూ ‘భారతి’ తరువాత 400 సంచికలు తీసుకువచ్చిన పత్రిక ప్రజాసాహితి అని, సుమారు 45కు పైగా ప్రత్యేక సంచికలు వెలువడ్డాయని చెప్పారు. వీటిలో రాజమహేంద్రవరానికి చెందిన కళాకారుడు గరికిపాటి రాజారావు, క్రొవ్విడి లింగరాజు అనువదించిన అమ్మ నవల మీద, అద్దేపల్లి రామ్మోహనరావుపైన తీసుకువచ్చిన ప్రత్యేక సంచికలు ఉన్నాయనితెలిపారు. భూస్వామ్య, సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వెలమాటి సత్యనారాయణ, డాక్టర్ చిలుకూరి కూర్మయ్య, పెమ్మరాజు గోపాలకృష్ణ, డాక్టర్ పసల భీమన్న తదితరులు పాల్గొన్నారు.