ప్రతిభను ప్రదర్శించేందుకే టోర్నమెంట్లు | Pradarsincenduke talent tournaments | Sakshi
Sakshi News home page

ప్రతిభను ప్రదర్శించేందుకే టోర్నమెంట్లు

Oct 2 2016 12:23 AM | Updated on Sep 4 2017 3:48 PM

క్రీడాకారుల ప్రతి భను ప్రదర్శించేం దుకు టోర్నమెంట్‌ లు ఉపయోగపడతాయని వీటిని సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయికి ఎదగాలని జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బండా ప్రకాష్‌ సూ చించారు.

హన్మకొండ చౌరస్తా : క్రీడాకారుల ప్రతి భను ప్రదర్శించేం దుకు టోర్నమెంట్‌ లు ఉపయోగపడతాయని వీటిని సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయికి ఎదగాలని జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బండా ప్రకాష్‌ సూ చించారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని సిటీజ¯ŒSక్లబ్‌లో శనివారం సాయంత్రం రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్‌ బాలబాలికల జూడో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3 వరకు జరగనున్న పోటీలను ఆయన ప్రారంభించారు.
 
ఈ సందర్బంగా క్రీడాకారులనుద్దేశించి రాష్ట్రంలో జూడో అభివృద్ధికి తన వం తుగా కృషి చేస్తానన్నారు. అసోసియేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాస్‌యాదవ్‌ మాట్లాడుతు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్ద¯ŒSరెడ్డి, ఎంఏ అజీజ్, కోశాధికారి బాలరాజు, కేయూ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ చక్రపాణి, నర్సంపేట మున్సిపల్‌ కమిషనర్‌మల్లికార్జునస్వామి, కార్పొరేటర్‌ సోబియా సబహత్, నవనీతరావు, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement