కానిస్టేబుల్ ఈవెంట్స్ షురూ | police constable events starts | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ ఈవెంట్స్ షురూ

Jul 16 2016 10:16 PM | Updated on Sep 17 2018 6:26 PM

కానిస్టేబుల్ ఈవెంట్స్ షురూ - Sakshi

కానిస్టేబుల్ ఈవెంట్స్ షురూ

పోలీసు కానిస్టేబుల్ ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) శుక్రవారం స్థానిక మేకల అభినవ స్టేడియంలో పకడ్బందీగా నిర్వహించారు.

పర్యవేక్షించిన ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి
800 మంది అభ్యర్థుల హాజరు
 
 నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు శుక్రవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి.  ఈవెంట్స్‌ను ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు.
 
 నల్లగొండ  : పోలీసు కానిస్టేబుల్ ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) శుక్రవారం స్థానిక మేకల అభినవ స్టేడియంలో పకడ్బందీగా నిర్వహించారు. 800 మీటర్ల పరుగు పందెం అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి ఈవెంట్స్‌లను దగ్గరుండి పర్యవేక్షించారు. గ్రౌండ్‌లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిశీలించారు. 800 మంది అభ్యర్థులు ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. శనివారం నుంచి 1,200 మంది అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులకు ఇంటిమేషన్‌లెటర్ ప్రకారం సరైన సమయానికి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ వెంట్స్‌లో ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement