అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
కోడికొండ చెక్‌పోస్టులో తనిఖీలు
Aug 9 2016 11:08 AM | Updated on Sep 4 2017 8:34 AM
- రెండు లారీలు సీజ్
చిలమత్తూరు రూరల్ : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తోన్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖాధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఒక్కో లారీలో 33 టన్నుల బియ్యం రవాణా అవుతోంది. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉండవచ్చు. ఎలాంటి బిల్లులు చూపించక పోవడంతో లారీలను సీజ్ చేసినట్లు డీసీటీఓ జేబీ నందా తెలిపారు. పట్టుబడిన లారీలు(కేఏ04ఏఏ 0227, కేఏ04ఏఏ 0224) కొత్త చెరువుకు చెందిన ఓ టీడీపీ నేతకు చెందినవిగా సమాచారం.
Advertisement
Advertisement