breaking news
kodikonda check post
-
నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల..
సాక్షి, సత్యసాయి జిల్లా: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల నెరవేరబోతోంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి మీదుగా కొడికొండ చెక్ పోస్టు వరకు నాలుగు లేన్ల రహదారి (ఫోర్‌లేన్)కు శ్రీకారం చుట్టారు. టెండర్ల దశకు రాగానే ఆయన మరణించారు. దీంతో ఇది మరుగున పడింది. తాజాగా ముద్దనూరు నుంచి తొండూరు, పులివెందుల, శ్రీసత్యసాయి జిల్లా కదిరి, ఓడీ చెరువు, గోరంట్ల మీదుగా కొడికొండ చెక్ పోస్టు వరకు ఇప్పుడున్న రహదారిని ఫోర్‌లేన్‌గా విస్తరింపజేసేందుకు వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందుకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మధ్యే ఆమోదం కూడా తెలిపింది. భూ సేకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. దాదాపు 160 కి.మీ ఉన్న ఈ ఫోర్‌లేన్ పనులు రూ.2 వేల కోట్లతో మొదటి దశలో రెండు ప్యాకేజీల ద్వారా మొదలెడతారు. దీనికి స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) కూడా ఆమోద ముద్ర వేసింది. రెండో దశలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు.. గోరంట్ల నుంచి హిందూపురం వరకు నాలుగు లేన్ల రహదారిగా విస్తరింపజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రహదారిని ఇప్పటికే జాతీయ రహదారి(716జీ)గా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఫోర్‌లేన్ పనులు రెండో దశలో చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.700 కోట్లు ఖర్చు కావచ్చని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. చదవండి: అంతర్జాతీయ బ్రాండ్ కానున్న అనంతపురం ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు సైతం.. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు డబుల్‌లేన్‌గా విస్తరించనున్నారు. 32 కి.మీ మేర ఉన్న ఈ జాతీయ రహదారి– 342ని రూ.401 కోట్లతో రెండు వరుసలుగా విస్తరించేందుకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రాయచోటి నుంచి కదిరి వరకు డబుల్ లేన్.. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి వరకు 70 కి.మీ మేర ఉన్న రహదారిని డబుల్‌లైన్‌గా మార్పు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకు టెండర్ల దశ కూడా పూర్తయింది. త్వరలోనే పనులు మొదలెట్టనున్నారు. దీన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని ఇటీవల రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ప్రయాణం సులభతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఈపాటికి ముద్దనూరు – కొడికొండ రహదారి ఫోర్‌లేన్‌గా ఎప్పుడో మారేది. ఆయన తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. కానీ రోడ్డుకు మోక్షం కలగలేదు. ఇన్నేళ్లకు వైఎస్ తనయుడు జగన్ తన తండ్రి కలను సాకారం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే బెంగళూరుకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. – నాదిండ్ల రవి రాయల్, కదిరి రూపురేఖలు మారతాయి 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కదిరికి రింగ్ రోడ్ అన్నాడు. తర్వాత ఆ ఊసే లేదు. ఆయన హయాంలో చెప్పుకోవడానికి ఒక్క పథకమూ లేదు. ఒక్క అభివృద్ది పనీ లేదు. ముద్దనూరు – కొడికొండ నాలుగు లేన్ల రహదారి కోసం భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుంది. పనులు కూడా వెంటనే మొదలవుతాయి. నూతనంగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో అనతి కాలంలోనే రహదారుల రూపురేఖలు మారిపోతాయి. – డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి -
కోడికొండ చెక్‌పోస్టులో తనిఖీలు
- రెండు లారీలు సీజ్ చిలమత్తూరు రూరల్ : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తోన్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖాధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఒక్కో లారీలో 33 టన్నుల బియ్యం రవాణా అవుతోంది. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉండవచ్చు. ఎలాంటి బిల్లులు చూపించక పోవడంతో లారీలను సీజ్ చేసినట్లు డీసీటీఓ జేబీ నందా తెలిపారు. పట్టుబడిన లారీలు(కేఏ04ఏఏ 0227, కేఏ04ఏఏ 0224) కొత్త చెరువుకు చెందిన ఓ టీడీపీ నేతకు చెందినవిగా సమాచారం. -
రేపు ‘అనంత’లో రాహుల్ యాత్ర
ఓబులదేవర చెరువు నుంచి ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు 10 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు. రాహుల్ పాదయాత్ర షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు ప్రకటించారు. రాహుల్ ఉదయం 6.30 గంటలకు ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఉదయం 7.15 గంటలకు కోడికొండ చెక్‌పోస్టు దగ్గర పీసీసీ నేతలు, పార్టీ ప్రముఖులు రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు. అందుకోసం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 24న ఉదయం 9 గంటలకు ఓబులదేవర చెరువు నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభిస్తారు. గ్రామంలోని జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు, రైతులు, చేనేత కార్మికులతో కొద్ది సేపు సమావేశమై వారి సాధకబాధకాలను వింటారు. తర్వాత మామిళ్లపల్లికుంట చేరుకుని రైతు హరినాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డబురవారిపల్లె చేరుకుని అక్కడి మహిళా సంఘాలు, ఉపాధికూలీలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి కొండకమర్ల, తర్వాత పుట్టపర్తి చేరుకుంటారు. -
కోడికొండ చెక్‌పోస్టుపై విజిలెన్స్ దాడులు
అనంతపురం (చిలమత్తూరు) : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్‌పై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1400 లీటర్ల కిరోసిన్‌ను సీజ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న నర్సింహులు, రసూల్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.