రేపు ‘అనంత’లో రాహుల్ యాత్ర | Rahul Gandhi to Undertake 'Padayatra' in Andhra Pradesh on July 24 | Sakshi
Sakshi News home page

రేపు ‘అనంత’లో రాహుల్ యాత్ర

Jul 23 2015 1:16 AM | Updated on Sep 3 2017 5:58 AM

రేపు ‘అనంత’లో రాహుల్ యాత్ర

రేపు ‘అనంత’లో రాహుల్ యాత్ర

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.

ఓబులదేవర చెరువు నుంచి ప్రారంభం
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు 10 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు. రాహుల్ పాదయాత్ర షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు ప్రకటించారు. రాహుల్ ఉదయం 6.30 గంటలకు ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఉదయం 7.15 గంటలకు కోడికొండ చెక్‌పోస్టు దగ్గర పీసీసీ నేతలు, పార్టీ ప్రముఖులు రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు.

అందుకోసం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 24న ఉదయం 9 గంటలకు ఓబులదేవర చెరువు నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభిస్తారు. గ్రామంలోని జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు, రైతులు, చేనేత కార్మికులతో కొద్ది సేపు సమావేశమై వారి సాధకబాధకాలను వింటారు. తర్వాత మామిళ్లపల్లికుంట చేరుకుని రైతు హరినాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డబురవారిపల్లె చేరుకుని అక్కడి మహిళా సంఘాలు, ఉపాధికూలీలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి కొండకమర్ల, తర్వాత పుట్టపర్తి చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement