ఆకలి తీర్చండి.. | Phekar closed Ferro industries allayus | Sakshi
Sakshi News home page

ఆకలి తీర్చండి..

Jul 9 2016 11:27 PM | Updated on Sep 4 2017 4:29 AM

నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఫేకర్, ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు తెరిపించి వేలాది మంది కార్మికుల


 చీపురుపల్లి/గరివిడి: నియోజకవర్గ పరిధిలో  మూతపడిన ఫేకర్, ఫెర్రో అల్లాయూస్  పరిశ్రమలు తెరిపించి వేలాది మంది కార్మికుల ఆకలి మంటలు తీర్చాలని సీఐటీయూ ప్రతినిధులు అంబల్ల గౌరునాయుడు, జంపన విశ్వనాథరాజు డిమాండ్ చేశారు. ఆకలియూత్ర పేరుతో సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు, మహిళలు గరివిడి నుంచి చీపురుపల్లి వరకు పాదయూత్ర చేపట్టారు.
 
  అనంతరం పట్టణంలోని కొత్త గవిడివీధిలో గల రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే సీఐ ఎస్.రాఘవులు, ఎస్సై టి.కాంతికుమార్ నేతృత్వంలో పోలీసులు కార్మికులు, నాయకులను అడ్డుకున్నారు. దీంతో  క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి పరిశ్రమలు తెరిపించాలి.. కార్మికుల జీవితాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజిన్ కార్యదర్శి అంబల్ల గౌరునాయుడు మాట్లాడుతూ, రెండేళ్లుగా గరివిడిలో ఫేకర్ పరిశ్రమ మూతపడిందన్నారు.
 
 దీంతో వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని మెరకముడిదాం, గుర్ల మండలాల్లో ఉన్న ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు కూడా మూతపడ్డాయని, ఈ విషయూన్ని మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అనంతరం మంత్రి మృణాళిని క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఆర్‌ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, రెడ్డి గోవింద్, నానిబాబులకు కార్మికులు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement