కేఎంసీలో పీజీ సీట్లు పెంపు | pg seats increase in kmc | Sakshi
Sakshi News home page

కేఎంసీలో పీజీ సీట్లు పెంపు

Mar 28 2017 10:22 PM | Updated on Oct 9 2018 7:39 PM

కర్నూలు మెడికల్‌ కాలేజీకి పీజీ సీట్లు పెంచుతూ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కాలేజీకి పీజీ సీట్లు పెంచుతూ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తంగా 153 సీట్లు మంజూరు కాగా అందులో కర్నూలు మెడికల్‌ కాలేజి‍కి 30 పెరిగాయి. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో 12 నుంచి 20కి, పీడియాట్రిక్స్‌లో 5 నుంచి 8కి, అనెస్తీషియాలో 6 నుంచి 7కు, రేడియాలజిలో 3 నుంచి 6కు, జనరల్‌ సర్జరీలో 10 నుంచి 20కి, ఆర్థోపెడిక్స్‌లో 8 నుంచి 11కు, ఈఎన్‌టీలో 4 నుంచి 5కు, గైనకాలజిలో 6 నుంచి 7కు పీజీ సీట్లు పెరిగాయి. కనీసం 90 సీట్లకు పైగా పెరుగుతాయని ఆశించగా  30 సీట్లు మాత్రమే పెరగడం వైద్యవర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగినంతగా కృషి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement