చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | person dead | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Aug 8 2016 12:32 AM | Updated on Sep 4 2017 8:17 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ఏలూరు రూరల్‌ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ఏలూరు రూరల్‌ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఏలూరు రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన మాచర్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై వెళుతూ ఈ నెల 2న మండలంలోని చొదిమెళ్ల వద్ద ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో గుంటూరు తరలించారు. అప్పటి నుంచి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఏలూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement