యలమంచిలి : మండలంలోని లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి, అబ్బిరాజుపాలెం, యలమంచిలి, చించినాడ పుష్కరఘాట్‌లలో మాత్రమే అంత్య పుష్కరాలలో పుణ్య స్నానాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తహసీల్దార్ చాగలకొండు గురు ప్రసాదరావు, ఎస్సై పాలవలస అప్పారావు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు.
ఆరు ఘాట్‌లకే అనుమతి
Jul 29 2016 10:30 PM | Updated on Sep 4 2017 6:57 AM
యలమంచిలి : మండలంలోని లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి, అబ్బిరాజుపాలెం, యలమంచిలి, చించినాడ పుష్కరఘాట్‌లలో మాత్రమే అంత్య పుష్కరాలలో పుణ్య స్నానాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తహసీల్దార్ చాగలకొండు గురు ప్రసాదరావు, ఎస్సై పాలవలస అప్పారావు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. ఆ ఘాట్‌లలో మాత్రమే పోలీసులు, అధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. మిగిలిన కనకాయలంక, పెదలంక, ఏనుగువానిలంక, యలమంచిలిలంక, గంగడుపాలెం, కంచుస్తంభంపాలెం, బాడవ గ్రామాలలోని పుష్కరఘాట్‌లలో ఎటువంటి వసతులు కల్పించడం లేదన్నారు. ఈ ఘాట్‌లలో పుష్కర స్నానాలను నిషేధించామని, యాత్రికులెవరూ ఈ ఘాట్లలో స్నానాలు చేయవద్దని వారు హెచ్చరించారు.
Advertisement
Advertisement