మైక్రో ఏటీఎంల ద్వారా పింఛన్ల పంపిణీ : కలెక్టర్‌ | Sakshi
Sakshi News home page

మైక్రో ఏటీఎంల ద్వారా పింఛన్ల పంపిణీ : కలెక్టర్‌

Published Wed, Dec 7 2016 10:31 PM

మైక్రో ఏటీఎంల ద్వారా పింఛన్ల పంపిణీ : కలెక్టర్‌ - Sakshi

విజయవాడ : మైక్రో ఏటీఎం ద్వారా జిల్లాలో 3.30 లక్షల మంది పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ బాబు.ఏ, ప్రపంచబ్యాంకు బృందానికి వివరించారు. నగరంలో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిదులు విలియం ప్రైస్, వర్గామరాథే, గౌతమ్‌ బరద్వాజ్‌ తూరుల్‌కన్నా, శశి, ఇంగ్టాండ్‌ ప్రతినిధి డారిన్, రైడర్‌లు  కలెక్టర్‌తో బుధవారం సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అమలు జరుగుతున్న నగదు రహిత లావాదేవీలు, ఆధార్‌తో పింఛన్లు, ఫెర్టిలైజర్స్, ప్రజాపంపిణీ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీపై ప్రపంచè బ్యాంకు సభ్యులకు వివరించారు. 1250 మందికి బిజినెన్‌ కరస్పాండెంట్ల ద్వారా ప్రతీ గ్రామం, ప్రతీ వార్డులోనూ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 40 వేల వాణిజ్య వ్యాపార సంస్థల్లో స్వైపింగ్‌ మిషన్‌లు ఏర్పాటుపై 120 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ కుటుంబంలో కనీసం ఒకరికి బ్యాంకు ఖాతా, ఆధార్, ఎన్‌పీసీఐతో అనుసంధానం కలిగి ఉన్నాయని బృందానికి తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌ రాజు, డీడీవో అనంతకృష్ణ పాల్గొన్నారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement