పెద్దముడియం తహసీల్దార్‌ సస్పెన్షన్‌ | Peddamudiyam tahasildar suspension | Sakshi
Sakshi News home page

పెద్దముడియం తహసీల్దార్‌ సస్పెన్షన్‌

Jan 7 2017 11:43 PM | Updated on Sep 5 2017 12:41 AM

జమ్మలమడుగు నియోకవర్గంలోని పెద్దముడియం తహసీల్దార్‌ వెంకటసుబ్బయ్య, వీఆర్వోలు ఓబయ్య, షహబుద్దీన్‌ను కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

కడప అగ్రికల్చర్‌, జమ్మలమడుగు : జమ్మలమడుగు నియోకవర్గంలోని పెద్దముడియం తహసీల్దార్‌ వెంకటసుబ్బయ్య, వీఆర్వోలు ఓబయ్య, షహబుద్దీన్‌ను కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయానికి తహసీల్దార్‌ వెంకటసుబ్బయ్య తరుచూ మద్యం సేవించి వస్తుండడం... ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా నిర్వర్తించలేకపోవడం తదితర కారణాలపై సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పదిరోజుల కిందట  వీఆర్వోలు షహబుద్దీన్, ఓబయ్యతో కలిసి తహసీల్దార్‌ ఆళ్లగడ్డలోని ఓబార్‌లో మద్యం తాగుతూ పట్టుబడ్డారు.  దీనిపై విచారణ చేపట్టిన ఆర్డీఓ నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. దీని ఆధారంగా కలెక్టర్‌   తహసీల్దార్, వీఆర్వోలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement