12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా | passport mela at tirupati on september 12 | Sakshi
Sakshi News home page

12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా

Sep 9 2015 8:19 AM | Updated on Sep 3 2017 9:04 AM

12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా

12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా

ఈనెల 12న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఈనెల 12న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 600 మందికి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లు ఇస్తున్నట్టు తెలిపారు.

9 నుంచి అపాయింట్‌మెంట్‌లు అందుబాటులోకి వస్తాయని, కేవలం సాధారణ పాస్‌పోర్ట్‌లకే చేసుకోవాలని, తత్కాల్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ స్లాట్‌లకు  www.passportindia.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement