పర్వత చిట్టిబాబు గుండె పోటుతో మృతి | parvatha chittibabu died cardiac arrest in kakinada | Sakshi
Sakshi News home page

పర్వత చిట్టిబాబు గుండె పోటుతో మృతి

Mar 13 2016 10:18 AM | Updated on Aug 10 2018 9:42 PM

తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఆదివారం గుండెపోటు మృతి చెందారు.

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఆదివారం గుండెపోటు మృతి చెందారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. చిట్టిబాబు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చిట్టిబాబు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి ఎన్ చిన్నరాజప్ప, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సంతాపం తెలిపారు.  నేటి సాయంత్రం 4.00 గంటలకు పర్వత చిట్టిబాబు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని శంకవరంలో జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement