లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి

Feb 3 2016 10:04 AM | Updated on Aug 30 2018 3:58 PM

కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పంఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం పోతురాజు గుడి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది.


నక్కలపుట్టుకు చెందిన సంతల వ్యాపారి పప్పు వెంకటరావు(55) కుటుంబ సభ్యులతో కలిసి కారులో విశాఖపట్నం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పోతురాజు గుడి సమీపంలో అదుపు తప్పి లోయాలోకి దూసుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న వెంకటరావు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య పార్వతి, చెల్లెలు కొండమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.





 

Advertisement
 
Advertisement
Advertisement