బయోమెట్రిక్ కోసం వెళ్లి.. | one dies of sunstroke | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్ కోసం వెళ్లి..

May 4 2016 6:55 PM | Updated on Mar 28 2018 11:26 AM

రేషన్‌షాపు వద్ద బయోమెట్రిక్ కోసం ఎండలో నిలబడిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు.

- వడదెబ్బతో ఒకరి మృతి
జవహర్‌నగర్

రేషన్‌షాపు వద్ద బయోమెట్రిక్ కోసం ఎండలో నిలబడిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ గిరిప్రసాద్‌నగర్‌లో  బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది.


వివరాలు.. గబ్బిలాలపేటలోని రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ విధానం కోసం బుధవారం అధికారులు వేలిముద్రలు తీసుకున్నారు. ఈక్రమంలో గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం(44) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిలబడి వేలిముద్రలు ఇచ్చాడు. ఇంటికి వచ్చిన అతడు మంచినీళ్లు తాగిన వెంటనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్నుమూశాడు. అతడు వడదెబ్బతోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement