పట్టణంలోని అయ్యలూరు మెట్ట వద్ద లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
Feb 21 2017 12:11 AM | Updated on Sep 5 2017 4:11 AM
నంద్యాల: పట్టణంలోని అయ్యలూరు మెట్ట వద్ద లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సోమవారం గుజరాత్ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ.. బైక్‌పై వెళ్తున్న లారీ సిలార్‌బాషా (35)ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శిరివెళ్లకు చెందిన రైతు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందగానే రూరల్ ఎస్‌ఐ రమణ సంఘటన స్థలానికి చేరుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేశారు
Advertisement
Advertisement