పోలవరం నిర్వాసితుల పోరుబాట
	ఆర్‌ఆర్ ప్యాకేజీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
	లేకుంటే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరిక 
	 
	ప్రభుత్వం, అధికారుల తీరుపై పోలవరం ముంపు బాధితులు మండిపడ్డారు. పోరాటానికి సిద్ధమయ్యారు. ఆర్‌ఆర్‌ప్యాకేజీపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం వేలేరుపాడు 
	 
	వేలేరుపాడు :  
	పోలవరం ప్యాకేజీ  ముంపుబాధితులకు  జీవన్మరణ సమస్యగా మారింది. ఇంతకాలం ఏం జరిగినా సహనంగా విని ఊరుకున్న ఈ ప్రాంత ప్రజలు ఎంతకైనా తెగించడానికి సిధ్ధమయ్యారు. ప్యాకేజీ అంశాన్ని ప్రభుత్వం నానబెడ్తుండటంతో రోజురోజుకూ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. అసలు సమస్యకు సమాధానాలు వదిలేసి అధికారులు ఎన్ని సాకులు చెప్పినా ప్రజలు వినే పరిస్ధితిలో లేరు. ప్రభుత్వం ఇలాగే తమాషాలు చేస్తే, రానురాను పరిస్ధితులు చేయిదాటి పోయినా ఆశ్చర్యనక్కరలేదు. తాజాగా ఇండ్ల సర్వే  కోసం  సీరియల్ నెంబర్‌లు వేయడానికి వెళ్ళిన అధికారులకు ప్రజల నుండి ఎదురైన  వ్యతిరేకత, నిరసన సెగలు, ఇందుకు అద్దంపడుతున్నాయి. ‡ఏదో రకంగా ఏరుదాటి తెప్పతగలేద్దామన్న చందంగా అధికారుల వైఖరి కనబడుతోంది. కుక్కునూరు మండలంలో ఆర్‌ఆర్  సర్వేకు ముందు ప్యాకేజీ ప్రకటించిన అధికారులు వేలేరుపాడు మండలానికి వచ్చేసరికి ప్యాకేజీ ప్రకటించకపోయినా స్పష్టత  ఇవ్వలేకపోతున్నారు. కుక్కునూరు మండలంలో భూసేకరణ జరగలేదు కనుక అక్కడ ప్యాకేజీ ప్రకటించాల్సి వచ్చిందని, వేలేరుపాడులో 2006,2007 సంవత్సరంలో భూసేకరణ జరిగినందున ఇక్కడ నూతన భూసేకరణ(2013) ప్రకారం ప్యాకేజీ ప్రకటించలేమని అధికారులు చెబుతున్నారు.   సర్వే చేపడితే  కుటుంబాల సంఖ్య, ఎంతమంది యువతీ  యువకులున్నది ఒక అంచనా వస్తుందని, ఈ అంచనాను బట్టి ప్రభుత్వానికి ప్యాకేజీ పై ఎంత  వ్యయం అన్నది స్పష్టత  లభిస్తుందని, ఆ తర్వాతే  జీఓ విడుదలవుతుందని భూసేకణాధికారి పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే కుటుంబాల లెక్క తేలినంత మాత్రాన   కుటుంబానికిచ్చే ప్యాకేజీ పై స్పష్టతలేనప్పుడు అంచనా వ్యయం ఎలా తెలుస్తుందన్న   అనుమానాలు నిర్వాసితుల్లో ఉదయిస్తున్నాయి. ఇప్పుడైతే గ్రామాలు ఖాళీ చేయడంలేదు.  ఇంత హడావుడిగా సర్వే చేపట్టేకంటే ఆర్‌ఆర్ ప్యాకేజీ పై ప్రభుత్వ జీఓ ప్రకటించిన అనంతరం సర్వే చేపట్టినట్లయితే  పూర్తి సహకారం అందిస్తామని నిర్వాసితులు వాపోతున్నారు. అధికారుల అవకాశవాదధోరణి  వల్ల నిర్వాసితుల్లో  తీవ్ర ఆందోళన నెలకొంది. 
	వేలేరుపాడుకు 2013 చట్టం ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చారు...
	వేలేరుపాడు మండలంలో రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము రెవిన్యూల్లో ఖాల్సా భూములకు, సిధ్ధారం రెవిన్యూ  గ్రామంలో పట్టా భూములకు  2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించనున్నారు. ఈ మేరకు 2013వ సంవత్సరం 30 వచట్టం వలన  భూసేకరణ,పునరావాసం,పునః స్ధాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు పారదర్శకత చట్టంలో సెక్షన్ 11 (1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 19, సబ్ రూల్ (1) అనుసరించి నోటిఫికేషన్ జారీ చేసారు.ææ 
	ఆర్‌ఆర్‌కు ఇది వర్తించదంటున్నారు...
	ఇంత వరకు బాగానే ఉన్నా ఆర్‌ఆర్ ప్యాకేజీ విషయానికొస్తే, ఈ చట్టం వర్తించదని అధికారులు అంటున్నారు. వేలేరుపాడుకు రెవిన్యూ గ్రామంలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిచ్చే తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము గ్రామాలు వేలేరుపాడు మండలం కేంద్రం పరిధిలోనే  ఉన్నాయి. ∙ll
	సర్వేకు సానుకూలంగా  అధికార పార్టీ... ∙
	ఇదిలా ఉండగా అధికార పార్టీ మాత్రం ఇండ్ల సర్వేకు సానుకూలంగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు అఖిల పక్షంతో పాటు ఆందోళనలు చేసిన  ఆ పార్టీ నాయకులు నేడు సర్వేకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న అధికారులు స్ధానిక నేతలను వెంటబెట్టుకొని కొన్ని  చోట్ల నామమాత్రంగా ఇండ్లకు నెంబర్‌లు వేస్తున్నారు. ఇండ్ల యజమానులు తమ ఇండ్లకు తాళాలు వేసుకొని పనులకు వెళ్ళినా, వాటికి కూడా నెంబర్లు  వేసారు. 
	మమ్మల్ని ఇంకా ముంచాలనే చూస్తున్నారు: తెల్లం బూబమ్మ గిరిజన
	 నిర్వాసితురాలు  ఎర్రబోరు వేలేరుపాడు మండలం 
	ఇంకా మ్మల్ని ముంచాలనే అధికార్లు చూస్తున్నారు. నాకు 9ఎకరాల పొలం ఉంది. 2006లో భూమికి బదులు భూమికింద 610 కుంటల భూమిపోను 2.30 ఎకరాలకు ఎకరాకు లక్షా15వేల చొప్పున  3లక్షల20 వేల పరిహార ఇచ్చారు. ఇందులో  బ్యాంక్ అప్పులకు 70లు జమ  చేసుకున్నారు. మిగతావి ఖర్చులకే అయిపోయాయి. మిగిలింది వట్టి చేతులే. ఆర్‌ఆర్ ప్యాకేజీ అన్నా  మంచిగ వస్తది అనుకుంటే  అదీ ప్రకటించడంలేదు. 
	భూములకిచ్చేటప్పుడు ఇండ్లకెందుకు ఇవ్వరు:
	 కారం వెంకటరమణ సర్పంచ్ రేపాకగొమ్ము
	2013 చట్టం ప్రకారం రేపాకగొమ్ము గ్రామ పంచాయితీలో భూములకు పరిహారం ఇస్తున్నప్పుడు ఇండ్లకు ఎందుకివ్వరు. చట్టం అంతటా వర్తిస్తుంది. కావాలనే, ప్రభుత్వం మాయ చేస్తోంది. 
	ప్రజల తిరుగుబాటు తప్పదు: జాన్‌బాబు నడిమిగొమ్ము
	ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే గ్రామాల్లో తిరగబడతారు. అన్ని విధాలా నష్టపోయిన తమకు  ఉద్యమ బాట పట్టక తప్పేటట్లు లేదు.