కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ కానీ సీట్లకు ఈ నెల 25న పాలిటెక్నిక్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్‌ల ప్రక్రియ ద్వారా సీట్లు భర్తీ చేయనున్నట్లు స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ మస్తానయ్య తెలిపారు.
25న పాలిటెక్నిక్ కోర్సులకు ప్రవేశాలు
Jul 21 2016 10:35 PM | Updated on Sep 17 2018 7:38 PM
కందుకూరు: కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ కానీ సీట్లకు ఈ నెల 25న పాలిటెక్నిక్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్‌ల ప్రక్రియ ద్వారా సీట్లు భర్తీ చేయనున్నట్లు స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ మస్తానయ్య తెలిపారు. మొదటి సంవత్సరం ఎలక్ట్రికల్, సివిల్ డిప్లమా విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. పదో తరగతి పాసై పాలీసెట్–2016 పరీక్ష రాసిన, రాయని విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పాలీసెట్ రాసి ర్యాంకు వచ్చిన వారు రూ.300లు, ర్యాంకు రాని వారు రూ.650లు ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పాట్ అడ్మిషన్‌లో సీటు పొందిన అభ్యర్థులు అదే రోజు రూ.3800లు కాలేజీ ఫీజు, వారి ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో కాలేజీ ప్రిన్సిపాల్‌కు అందజేయాలన్నారు.
Advertisement
Advertisement