తెలంగాణకు ఎన్టీపీసీ వెలుగులు | ntpc current in telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ఎన్టీపీసీ వెలుగులు

Aug 15 2016 7:53 PM | Updated on Sep 22 2018 7:53 PM

తెలంగాణకు ఎన్టీపీసీ వెలుగులు - Sakshi

తెలంగాణకు ఎన్టీపీసీ వెలుగులు

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని వెలుగులు అందించేందుకు ఎన్టీపీసీ సంస్థ నూతన యూనిట్ల నిర్మాణం చేపట్టిందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ మహాపాత్ర అన్నారు. సోమవారం 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పర్మనెంట్‌ టౌన్‌షిప్‌లోని మహాత్మగాంధీ మైదానంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సీఐఎస్‌ఎఫ్, విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు.

  • ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ మహాపాత్ర
  • జ్యోతినగర్‌ : తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని వెలుగులు అందించేందుకు ఎన్టీపీసీ సంస్థ నూతన యూనిట్ల నిర్మాణం చేపట్టిందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ మహాపాత్ర అన్నారు. సోమవారం 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పర్మనెంట్‌ టౌన్‌షిప్‌లోని మహాత్మగాంధీ మైదానంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సీఐఎస్‌ఎఫ్, విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు స్టేజ్‌–1లో 2‘800=1600 మెగావాట్ల ప్రాజెక్టుకు దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.  ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. స్టేజ్‌–2లో 3‘800=2400 మెగావాట్ల ప్రాజెక్టుకు ఎన్టీపీసీ సంస్థ బోర్డు సమావేశంలో తీర్మానించిందని వెల్లడించారు. మొత్తంగా 4 మెగావాట్ల ప్రాజెక్టు రామగుండంలో నిర్మాణం అవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ హరితహారం కార్యక్రమానికి సంస్థ చేయూత అందించిందన్నారు. ప్రభావిత, పునరావాస గ్రామాల అభివద్ధికి సీఎస్సార్‌ నిధులు ఎక్కువ మొత్తంలో కేటాయించినట్లు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 108 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. యంజీఆర్‌ విభాగం ఉద్యోగులు విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్‌–2014కు ఎంపికకావడం అభినందనీయమన్నారు. సదరన్‌ రీజియన్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో రామగుండం ఉద్యోగులు ప్రతిభ కనబర్చి బంగారు పతకాలను సాధించారని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొని ఉత్తమంగా నిలిచిన పాఠశాలలకు, సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లకు జ్ఞాపికలు అందజేశారు. టౌన్‌షిప్‌లోని కేంద్రియ, సెయింట్‌ క్లేయిర్, సచ్‌దేవ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, ప్రభుత్వ  జిల్లా పరిషత్‌ పాఠశాల, బాలభవన్, వయోజన విద్యాకేంద్రం, సీఐఎస్‌ఎఫ్‌ జవానులు ప్రదర్శించిన కవాతుకు బహుమతులు అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక ప్రదన్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి  అధ్యక్షురాలు సుజాత మహాపాత్ర, జనరల్‌ మేనేజర్లు యూకే.దాస్‌గుప్తా, భావరాజు శ్రీనివాసరావు, శ్రీనివాస్, ఏజీఎం హెచ్‌ఆర్‌ రమేశ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement