నాగార్జున సాగర్ కుడి కాలువకు నవంబరు 1 నుంచి రబీ పంటకు సాగు నీరు విడుదల కానున్నట్లు స్పీకర్ కోడెల..
నవంబర్ 1 నుంచి సాగర్ కుడి కాలువకు నీరు
Oct 25 2016 9:40 PM | Updated on Jul 29 2019 2:44 PM
సత్తెనపల్లి: నాగార్జున సాగర్ కుడి కాలువకు నవంబరు 1 నుంచి రబీ పంటకు సాగు నీరు విడుదల కానున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడామన్నారు. నవంబరు 1 నుంచి కుడి కాలువకు సాగునీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతులు ఆరుతడి పంటల సాగుకు ఆరాటంగా ఉన్నారన్నారు. నీటిని రైతు సోదరులు శాస్త్రీయ పద్ధతిలో వాడు కోవాలన్నారు. ప్రస్తుతం సాగర్‌లో 540 అడుగులు నీటి మట్టం ఉందని, గతంలో 515 అడుగులు ఉన్నప్పుడే సాగునీటిని విడుదల చేశామన్నారు.
Advertisement
Advertisement