పెద్ద నోట్ల మార్పిడి ముఠా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.
నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు
Dec 24 2016 11:25 PM | Updated on Sep 4 2017 11:31 PM
వెలుగోడు: పెద్ద నోట్ల మార్పిడి ముఠా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన నోట్ల మార్పిడికి ప్రయత్నించిన ముఠాను అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో నలుగురు నిందితులు పారిపోగా గత వారంలో ఇద్దరు లొంగిపోయారు. శనివారం ఈ కేసులో 5వ నిందితుడైన సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, 6వ నిందితుడైన నంద్యాలకు చెందిన పీవై ఆంజనేయులు వెలుగోడు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. వీరిని ఆత్మకూరు సీఐ కృష్ణయ్య విచారించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్‌ఐ బాషా, హెడ్‌కానిస్టేబుల్స్ దశరథరామిరెడ్డి, షాషావలీ, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement