సర్పంచ్ ఇంటి ముందు పార్క్ చేసిన కారును ఆర్థరాత్రి దుండగులు తగులబెట‍్టారు.
నిడమనూరు: సర్పంచ్ ఇంటి వద్ద పార్క్ చేసిన కారును ఆర్థరాత్రి దుండగులు తగులబెట్టిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. నిడమనూరు సర్పంచ్ కోటేశ్వరరావు కారును గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి దగ్ధం చేశారు. కోటేశ్వరరావు ఇటీవలే టీడీపీ నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మారడంతో టీడీపీ వర్గీయులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పడమట పీఎస్‌లో కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.