రేపు ఎన్జీరంగా వర్సిటీ స్నాతకోత్సవం | NG Ranga University convocation day tomorrow at rajahmundry | Sakshi
Sakshi News home page

రేపు ఎన్జీరంగా వర్సిటీ స్నాతకోత్సవం

Jan 3 2016 7:46 PM | Updated on Sep 3 2017 3:01 PM

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవం సోమవారం రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో నిర్వహించనున్నట్టు వైస్ చాన్సలర్ అల్లూరి పద్మరాజు తెలిపారు.

రాజమండ్రి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవం సోమవారం రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో నిర్వహించనున్నట్టు వైస్ చాన్సలర్ అల్లూరి పద్మరాజు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సంబంధించిన చివరి స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. 575 మంది విద్యార్థులు స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోనున్నారని, మిగిలిన 500 మందికి పోస్టు ద్వారా పంపిస్తామన్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పద్మరాజు తెలిపారు. ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో పాటు వివిధ విభాగాలలో పలువురికి అవార్డులను అందించనున్నట్టు వీసీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement