కొత్తగా ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయాలు | New Forest Range offices | Sakshi
Sakshi News home page

కొత్తగా ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయాలు

Sep 15 2016 12:40 AM | Updated on Sep 4 2017 1:29 PM

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా డోర్నకల్‌లో ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయం ఏర్పాటు కానుంది. గతంలో మహబూబాబాద్‌ ఫారెస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో డోర్నకల్‌ ఉండేది. మహబూబాబాద్‌ కొత్త జిల్లాగా ఏర్పాటు కానుండడంతో మానుకోట, పాకాల అటవీ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండూ కొత్తగూడెం జిల్లా సర్కిల్‌ పరిధిలోకి వస్తాయి. ,

డోర్నకల్‌ : కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా డోర్నకల్‌లో ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయం ఏర్పాటు కానుంది. గతంలో మహబూబాబాద్‌ ఫారెస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో డోర్నకల్‌ ఉండేది. మహబూబాబాద్‌ కొత్త జిల్లాగా ఏర్పాటు కానుండడంతో మానుకోట, పాకాల అటవీ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండూ కొత్తగూడెం జిల్లా సర్కిల్‌ పరిధిలోకి వస్తాయి. పాకాల పరిధిలో గూడూరు, కొత్తగూడ రేంజ్‌ కార్యాలయాలు, మహబూబాబాద్‌ పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, బయ్యా రం, తొర్రూరులో రేంజి కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మహబూబాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ రేంజిని ఏర్పాటు చేస్తున్నారు.
 
మహబూబాబాద్‌ రేంజి పరిధిలో ఈదులపూసపల్లి, కంబాలపల్లి, జమాండ్లపల్లి, కేసముద్రం, ఇనుగుర్తి, తాళ్లపూసపల్లి, నాగారం, ఎఫ్‌ఎస్‌ఓ మహబూబాబాద్‌ నర్సరీ, ఎఫ్‌ఎస్‌ఓ మహబూబాబాద్‌ సెక్షన్లు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్‌ పరిధిలో రెండు ఎఫ్‌ఎస్‌ఓ టీపీ సెక్షన్లు ఉన్నాయి. డోర్నకల్‌ రేంజి పరిధిలో డోర్నకల్, ఎఫ్‌ఎస్‌ఓ కురవి, మరిపెడ సెక్షన్లు ఉండగా, బయ్యారం రేంజి పరిధిలో బయ్యారం, గౌరారం, కొత్తపేట సెక్షన్లు, ఎఫ్‌ఎస్‌ఓ కోర్టు డ్యూటీ, ఎఫ్‌ఎస్‌ఓ నర్సరీ సెక్షన్లు ఉన్నాయి.
 
తొర్రూరు రేంజి పరిధిలో రెండు ఎఫ్‌ఎస్‌ఓ నర్సరీ, ఎఫ్‌ఎస్‌ఓ తొర్రూరు, ఎఫ్‌ఎస్‌ఓ నర్సింహులపేట సెక్షన్లు ఉన్నాయి. రేంజి కార్యాలయ పరిధిలో రేంజి అధికారి, సెక్షన్‌ అధికారి, ఒక్కో సెక్షన్‌కు ఇద్దరు ఫారెస్ట్‌ బీట్‌ అధికారులను నియమించనున్నారు. వీరితో పాటు కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్, అటెండర్‌ను నియమించనున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement