సూర్యాపేట పట్టణంలో నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకుచెందిన 15మందిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి రూ.29 లక్షల 80 వేలను స్వాధీనం చేసుకున్నారు. మూడు స్కార్పియో, ఇన్నోవా వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ పరిమళ ఆధ్వర్యంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ నగదు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరు అందించారు వంటి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.