కొత్త నోట్లు.. కొత్త నేరాలు!

కొత్త నోట్లు.. కొత్త నేరాలు! - Sakshi


నోట్ల రద్దుతో కొత్త తరహా నేరాలు

మార్పిడి, బంగారం పేరుతో బురిడీ

దోపిడీలకూ తెగబడుతున్న దుండగులు

తప్పుదారి పడుతున్న పోలీసులు, ఉద్యోగులు  




సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు ప్రభావం నేరాలపైనా పడింది. నోట్ల మార్పిడి, పాత నోట్లకు బంగారం వంటి సరికొత్త నేరాలకు పాల్పడుతూ ఎంతోమంది పోలీసులకు చిక్కు తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ నిందితులుగా ఉంటుండడం గమనార్హం. నోట్ల రద్దును ప్రకటించినప్పటి నుంచి కొత్త తరహా నేరాలు మొదలయ్యాయి.



నోట్ల మార్పిడి దందాలు

గత నెల 8న ఒక్కసారిగా నోట్ల రద్దును ప్రకటించడంతో అనేక మంది ‘నల్లబాబుల’ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. వెంట నే అలాంటి వారంతా తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే భారీగా కమీషన్ల దందా మొదలైంది. 20 నుంచి 50 శాతం వరకు కమీషన్లు తీసుకుంటూ అనేక మంది పాత నోట్లను మార్పిడి చేశారు. మరోవైపు బంగారాన్ని సైతం అధిక ధరకు బ్లాక్ మార్కెట్‌లో విక్రయించారు.



పోలీసులు సైతం

నోట్ల మార్పిడి కోసం తీసుకువెళ్తున్న నగదును దోచుకునే ముఠాలు మొదలయ్యారుు. కొంద రు తాము పోలీసులమని చెప్పుకొంటూ బాధి తుల వద్ద ఉన్న మొత్తాన్ని కాజేస్తున్నారు. ఇక లక్షల మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతుండటం అసలు పోలీసుల్నీ ‘ఆకర్షిం చింది’. అలాంటివారు తనిఖీల పేరుతో వచ్చి నగదుకు లెక్కలు చెప్పాలంటూ బాధితులను బెదిరించి అందినకాడికి దండుకుపోతున్నారు. నార్త్‌జోన్ పరిధిలో నమోదైన ఓ ‘తనిఖీల’ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు, బంజారాహిల్స్ ఠాణా పరిధిలో నమోదైన ‘దోపిడీ కేసు’లో ఏకంగా ఓ ఇన్‌స్పెక్టర్ స్థారుు అధికారి నిందితులుగా ఉండటం గమనార్హం.



బ్యాంకు, పోస్టల్ ఉద్యోగులూ..

నగదు మార్పిడి దందాలో కొందరు బ్యాంకు, పోస్టల్ ఉద్యోగులూ కీలకపాత్ర పోషిస్తు న్నారు. సరైన ధ్రువీకరణలు లేకుండా భారీ మొత్తంలో నగదు మార్పిడి చేసిన చైతన్యపురి సిండికేట్ బ్యాంకు ఉద్యోగులపై సరూర్‌నగర్ ఠాణాలో కేసు నమోదైంది. అలాగే ‘నల్ల బాబులకు’ సహకరిస్తూ రూ.36 లక్షలు మార్పిడి చేసిన ఆరోపణలపై పోస్టల్‌శాఖలో ఉన్నతాధికారి సహా ముగ్గురిపై సీబీఐ కేసు నమోదైంది.



ఘర్షణలూ మొదలు

తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్దా బందో బస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. పాత నోట్లను తీసుకోకపోవడం, పెద్ద నోటుకు చిల్లర లభించకపోవడం వంటి కారణాలతో అనేక చోట్ల ఘర్షణలు, చోరీలు సైతం జరుగుతున్నాయి.



పదుల సంఖ్యలో ఘటనలు

► పెద్దనోట్ల మార్పిడి కోసం వచ్చిన వ్యక్తిని బెదిరించి రూ.7 లక్షలు దోచుకున్న ముఠాను రాజేంద్రగనర్ పోలీసులు అరెస్టు చేశారు.

►బంజారాహిల్స్ పరిధిలో పాత నోట్లకు కొత్త కరెన్సీ ఇస్తామంటూ రూ.1.2 కోట్లు స్వాహా చేసిన కేసులో ఓ కాంగ్రెస్ నేత, పోలీసు ఇన్‌స్పెక్టర్ నిందితులుగా ఉన్నారు.

►పాతనోట్లు మార్చి ఇస్తానని సహచరుడి నుంచి డబ్బు తీసుకున్న సెక్యూరిటీ గార్డు శ్రీనివాసరావు ఆ పని చేయలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.

► బంజారాహిల్స్, మాదాపూర్, నారాయణ గూడ పోలీసులు లెక్కలు చూపని రూ.1.25 కోట్ల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

►రూ.100 నుంచి రూ.10 వరకు విలువగల నకిలీ కరెన్సీ చలామణీకి యత్నించిన ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకు న్నారు.

►రూ.500 పాత నోటుకు చిల్లర ఇవ్వలేదనే కారణంగా పెట్రోల్ బంక్ క్యాషియర్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఈ కేసు నమోదైంది.

►హస్తినాపురం పరిధిలోని ఓ మద్యం దుకాణంలో చోరీకి వచ్చిన దుండగులు రూ.10 నోట్లు, చిల్లరతో కూడిన రూ.50 వేల నగదు ఎత్తుకుపోయారు.

 

కట్టలు కట్టలుగా దొరుకుతున్న కరెన్సీ

నోట్ల రద్దు నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో లెక్కలు లేని నగదు భారీ మొత్తంలో దొరుకుతోంది. కొన్ని కేసుల్లో ఆ సొమ్ము ‘మార్పిడి’కి సంబంధించిందని నిర్ధారణ అవుతోంది. ఇలా చిక్కుతున్నదానిలో కొత్త కరెన్సీ సైతం భారీగా ఉంటుండటం గమనార్హం.

 

‘మార్పిడి’ మోసాలు

నోట్ల మార్పిడి పేరిట కొందరు మోసగాళ్లు దోపిడీకి తెరతీశారు. తక్కువ కమీషన్‌కే నోట్లను మార్పిడి చేస్తామంటూ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల వారికి ఎర వేయడం ప్రారంభించారు. పాత నోట్లు తీసుకుని ఫలానా చోటుకు రమ్మని చెప్పి.. వచ్చిన వారి నుంచి ఆ నోట్లు తీసుకుని పరారవుతున్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసుల వరకు వస్తున్నవి తక్కువేనని చెబుతున్నారు. తాము కోల్పోరుున డబ్బుకు లెక్క చెప్పగలిగిన వారు మాత్రమే పోలీసులను ఆశ్రరుుస్తున్నారని అంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top