breaking news
Cancellation of currency
-
కొత్త నోట్లు.. కొత్త నేరాలు!
► నోట్ల రద్దుతో కొత్త తరహా నేరాలు ► మార్పిడి, బంగారం పేరుతో బురిడీ ► దోపిడీలకూ తెగబడుతున్న దుండగులు ► తప్పుదారి పడుతున్న పోలీసులు, ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు ప్రభావం నేరాలపైనా పడింది. నోట్ల మార్పిడి, పాత నోట్లకు బంగారం వంటి సరికొత్త నేరాలకు పాల్పడుతూ ఎంతోమంది పోలీసులకు చిక్కు తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ నిందితులుగా ఉంటుండడం గమనార్హం. నోట్ల రద్దును ప్రకటించినప్పటి నుంచి కొత్త తరహా నేరాలు మొదలయ్యాయి. నోట్ల మార్పిడి దందాలు గత నెల 8న ఒక్కసారిగా నోట్ల రద్దును ప్రకటించడంతో అనేక మంది ‘నల్లబాబుల’ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. వెంట నే అలాంటి వారంతా తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే భారీగా కమీషన్ల దందా మొదలైంది. 20 నుంచి 50 శాతం వరకు కమీషన్లు తీసుకుంటూ అనేక మంది పాత నోట్లను మార్పిడి చేశారు. మరోవైపు బంగారాన్ని సైతం అధిక ధరకు బ్లాక్ మార్కెట్లో విక్రయించారు. పోలీసులు సైతం నోట్ల మార్పిడి కోసం తీసుకువెళ్తున్న నగదును దోచుకునే ముఠాలు మొదలయ్యారుు. కొంద రు తాము పోలీసులమని చెప్పుకొంటూ బాధి తుల వద్ద ఉన్న మొత్తాన్ని కాజేస్తున్నారు. ఇక లక్షల మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతుండటం అసలు పోలీసుల్నీ ‘ఆకర్షిం చింది’. అలాంటివారు తనిఖీల పేరుతో వచ్చి నగదుకు లెక్కలు చెప్పాలంటూ బాధితులను బెదిరించి అందినకాడికి దండుకుపోతున్నారు. నార్త్‌జోన్ పరిధిలో నమోదైన ఓ ‘తనిఖీల’ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు, బంజారాహిల్స్ ఠాణా పరిధిలో నమోదైన ‘దోపిడీ కేసు’లో ఏకంగా ఓ ఇన్స్పెక్టర్ స్థారుు అధికారి నిందితులుగా ఉండటం గమనార్హం. బ్యాంకు, పోస్టల్ ఉద్యోగులూ.. నగదు మార్పిడి దందాలో కొందరు బ్యాంకు, పోస్టల్ ఉద్యోగులూ కీలకపాత్ర పోషిస్తు న్నారు. సరైన ధ్రువీకరణలు లేకుండా భారీ మొత్తంలో నగదు మార్పిడి చేసిన చైతన్యపురి సిండికేట్ బ్యాంకు ఉద్యోగులపై సరూర్‌నగర్ ఠాణాలో కేసు నమోదైంది. అలాగే ‘నల్ల బాబులకు’ సహకరిస్తూ రూ.36 లక్షలు మార్పిడి చేసిన ఆరోపణలపై పోస్టల్‌శాఖలో ఉన్నతాధికారి సహా ముగ్గురిపై సీబీఐ కేసు నమోదైంది. ఘర్షణలూ మొదలు తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్దా బందో బస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. పాత నోట్లను తీసుకోకపోవడం, పెద్ద నోటుకు చిల్లర లభించకపోవడం వంటి కారణాలతో అనేక చోట్ల ఘర్షణలు, చోరీలు సైతం జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ఘటనలు ► పెద్దనోట్ల మార్పిడి కోసం వచ్చిన వ్యక్తిని బెదిరించి రూ.7 లక్షలు దోచుకున్న ముఠాను రాజేంద్రగనర్ పోలీసులు అరెస్టు చేశారు. ►బంజారాహిల్స్ పరిధిలో పాత నోట్లకు కొత్త కరెన్సీ ఇస్తామంటూ రూ.1.2 కోట్లు స్వాహా చేసిన కేసులో ఓ కాంగ్రెస్ నేత, పోలీసు ఇన్స్పెక్టర్ నిందితులుగా ఉన్నారు. ►పాతనోట్లు మార్చి ఇస్తానని సహచరుడి నుంచి డబ్బు తీసుకున్న సెక్యూరిటీ గార్డు శ్రీనివాసరావు ఆ పని చేయలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ► బంజారాహిల్స్, మాదాపూర్, నారాయణ గూడ పోలీసులు లెక్కలు చూపని రూ.1.25 కోట్ల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ►రూ.100 నుంచి రూ.10 వరకు విలువగల నకిలీ కరెన్సీ చలామణీకి యత్నించిన ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకు న్నారు. ►రూ.500 పాత నోటుకు చిల్లర ఇవ్వలేదనే కారణంగా పెట్రోల్ బంక్ క్యాషియర్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఈ కేసు నమోదైంది. ►హస్తినాపురం పరిధిలోని ఓ మద్యం దుకాణంలో చోరీకి వచ్చిన దుండగులు రూ.10 నోట్లు, చిల్లరతో కూడిన రూ.50 వేల నగదు ఎత్తుకుపోయారు. కట్టలు కట్టలుగా దొరుకుతున్న కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో లెక్కలు లేని నగదు భారీ మొత్తంలో దొరుకుతోంది. కొన్ని కేసుల్లో ఆ సొమ్ము ‘మార్పిడి’కి సంబంధించిందని నిర్ధారణ అవుతోంది. ఇలా చిక్కుతున్నదానిలో కొత్త కరెన్సీ సైతం భారీగా ఉంటుండటం గమనార్హం. ‘మార్పిడి’ మోసాలు నోట్ల మార్పిడి పేరిట కొందరు మోసగాళ్లు దోపిడీకి తెరతీశారు. తక్కువ కమీషన్‌కే నోట్లను మార్పిడి చేస్తామంటూ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల వారికి ఎర వేయడం ప్రారంభించారు. పాత నోట్లు తీసుకుని ఫలానా చోటుకు రమ్మని చెప్పి.. వచ్చిన వారి నుంచి ఆ నోట్లు తీసుకుని పరారవుతున్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసుల వరకు వస్తున్నవి తక్కువేనని చెబుతున్నారు. తాము కోల్పోరుున డబ్బుకు లెక్క చెప్పగలిగిన వారు మాత్రమే పోలీసులను ఆశ్రరుుస్తున్నారని అంటున్నారు. -
అనూహ్యం.. అతలాకుతలం
► కేంద్రం వరుస షాక్‌లతో ► రాష్ట్రం బెంబేలు ► రూ.2000 కోట్ల మేరకు పన్నుల వాటాకు గండి ► నోట్ల రద్దుతో ఆదాయ అంచనాలు తలకిందులు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రం... ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతోంది. జిల్లాల ఏర్పాటుతో రియల్ వ్యాపారం ఊపందుకుంది. భూముల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఇక ఆర్థిక లోటు ఉండదు అనుకుంటున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దు, కేంద్ర నిధుల్లో కోత ఆర్థిక శాఖను కలవరపెడుతోంది. పెద్ద నోట్ల రద్దుతో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర ఆర్థిక శాఖను అతలాకుతలం చేస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారం స్తంభించడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఊహించనంతగా పడిపో యింది. భవిష్యత్తులో వ్యాట్ పెరుగుతుందనే భరోసా ఉన్నప్పటికీ నగదు లావాదేవీలతో సంబంధమున్న వ్యాపారాలన్నీ స్తబ్దుగా ఉన్నాయి. కొత్త జిల్లాలతో రియల్ వ్యాపారం ఊపందుకుంటున్న తరుణంలో నోట్ల రద్దు ప్రభావం ఒక్కసారిగా దెబ్బతీసిందని ప్రభుత్వం భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం పెరుగుతుందని ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసుకుంది. కానీ కేంద్రం నిర్ణయంతో అంచనాలు తలకిందులయ్యాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నోట్ల రద్దు పరిణామాలు ఇప్పటికిప్పుడు అంచనా వేసే పరిస్థితి లేదని, కొంతకాలం గడిస్తే రాష్ట్రాలకు వచ్చే ఏయే పన్నులు పెరిగే అవకాశముంది, ఏయే పన్నులు తగ్గే పరిస్థితి ఉందని స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కేంద్రానికి లేఖ రాసే యోచన.. ఇదే తరుణంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో కోత పెట్టడం పుండు మీద కారం చల్లినట్ల యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.13,995 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. నెలసరి వా యిదాల్లో కేంద్రం ఈ నిధులు విడుదల చేస్తుంది. ఏడాది చివర్లో పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే రాబడికి అనుగుణంగా నిధుల్లో కోత వేస్తుంది. ఈసారి ఆర్థిక సంవత్సరం మధ్యలోనే 48 శాతం కోత విధించింది. దీంతో దాదాపు రూ.2,000 కోట్ల మేరకు పన్నుల వాటాను కేంద్రం కత్తిరించే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కలేసింది. నోట్ల రద్దు ప్రభావానికి తోడు పన్నుల ద్వారా రావాల్సిన రాబడి తగ్గటంతో ఈ నెలలో ఖర్చులకు సరిపడే ఆదాయం సమకూరుతుందా.. లేదా... అని ఆర్థిక శాఖ మల్ల గుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈ పరిణామాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. గవర్నర్ నరసింహన్‌కు నివేదించారు. తాజా పరిణామాలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.