భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు | national level sports in bhongir | Sakshi
Sakshi News home page

భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు

Oct 2 2016 10:43 PM | Updated on Sep 4 2017 3:55 PM

భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు

భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు

భువనగిరి టౌన్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి అన్నారు.

భువనగిరి టౌన్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాన్ని ఆదివారం ఆర్డీఓ పరిశీలించి మాట్లాడారు. క్రీడల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులకు కల్పించనున్న వసతి, భోజనం ఏర్పాట్ల గురించి అధికారులు అడిగితెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, లైటింగ్‌ సిస్టం ఏర్పాట్లపై మున్సిపాలిటీ అధికారుల ద్వారా ఆరా తీశారు. అనంతరం క్రీడల్లో పాల్గొనే 18 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పరియం చేసుకుని ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్‌ చైర్‌పర్సన్‌ సుర్వి లావణ్య, తహసీల్దార్‌ కె.వెంకట్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ మందడి ఉపేందర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి గువ్వా దయాకర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సోమ నర్సింహారెడ్డి, మున్సిపల్‌ డీఈ ఇ.ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement