నాని సినిమా సందడి | Nani Movie hubbub | Sakshi
Sakshi News home page

నాని సినిమా సందడి

Jul 28 2016 5:21 PM | Updated on Mar 28 2018 11:26 AM

నాని సినిమా సందడి - Sakshi

నాని సినిమా సందడి

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గురువారం సినిమా సందడి నెలకొంది. నాని నూతన చిత్రం మజ్నూకు సంబంధించిన సినిమా సన్ని వేశాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్రికరించారు. లో నాని సినిమా సందడి

 హిరో నాని చూసేందుకు  ఎగబడ్డ అభిమానులు

వికారాబాద్‌ రూరల్‌ : వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గురువారం  సినిమా సందడి నెలకొంది.  నాని నూతన చిత్రం మజ్నూకు సంబంధించిన సినిమా సన్ని వేశాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్రికరించారు. ఇందులో  తొలి పరిచయంగా అనూ అనే కొత్త హిరోయిన్‌ నట్టిస్తుండగా ఉయ్యాల జంపాల డైరెక్టర్‌ వీరేచి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అనంది క్రియేషన్‌ బ్యానర్‌పై పి. కిరణ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం  హిరోయిన్‌ పెళ్లి కూతురుగా ఉండి హిరో హిరోహిన్‌లు రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వచ్చి ఉండే చిత్రికరణ దృశ్యాలను చిత్రికరించారు. నాని వికారాబాద్‌ వచ్చాడని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని హిరో హిరోయిన్లను చూసేందుకు  ఆసక్తి కనబర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement