‘మున్సిపల్ సబార్డినేట్’ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక | Municipal working committee helds election | Sakshi
Sakshi News home page

‘మున్సిపల్ సబార్డినేట్’ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

May 14 2016 8:10 PM | Updated on Oct 16 2018 6:27 PM

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సబార్డినేట్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలను గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్‌లో శనివారం నిర్వహించారు.

తెనాలి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సబార్డినేట్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలను గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్‌లో శనివారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షునిగా యేగేంద్రనాథ్ (తెనాలి), ప్రధాన కార్యదర్శిగా పీవీ రంగారావు (సత్తెనపల్లి), కోశాధికారిగా కేఎండీ నాసిర్ హుస్సేన్ (ఎమ్మిగనూర్, చిత్తూరు జిల్లా), ఉపాధ్యక్షులుగా కేబీ మధుసూదన్‌రెడ్డి (జమ్మలమడుగు), కేవీఎస్ శర్మ (నరసరావుపేట), ఎం. రవిసుధాకర్ (శ్రీకాకుళం), ఎస్.విజయలక్ష్మి (నూజివీడు), సంయుక్త కార్యదర్శులుగా వి.చంద్రశేఖర్ (తణుకు), ఎం.రమేష్ (పలాస- కాశీబుగ్గ), అమీర్‌బాషా (ధర్మవరం), వీజే రత్నాంజలి (తాడేపల్లి), కార్యనిర్వాహణ కార్యదర్శులుగా కె.ఫజులుల్లా (మార్కాపురం), పి.రవిబాబు( బొబ్బిలి), ఎస్.బేబి( రాయదుర్గం), ఆర్.వసంతరావులను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన చిత్తూరు జిల్లా ఉంగనూరు మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement