టీడీపీ తరపున గెలిచిన కౌన్సిలర్ రఫీక్ ఇంటికి టీడీపీ నాయకులు విప్ నోటీసులను శనివారం అతికించారు.
► ఎన్నికల అధికారికి ఫిర్యాదు
ప్రొద్దుటూరు టౌన్ : టీడీపీ తరపున గెలిచిన కౌన్సిలర్ రఫీక్ ఇంటికి టీడీపీ నాయకులు విప్ నోటీసులను శనివారం అతికించారు. నోటీసులో మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న షఫీవుల్లా సంతకాన్ని ఫోర్జరీ చేయడంతోపాటు అతని ఇంటి డోర్ నంబర్, సెల్ నంబర్‌ను నోటీసుల్లో పొందుపరిచారు. ఈ విషయం తెలుసుకున్న ముక్తియార్ వర్గ కౌన్సిలర్లు షఫీవుల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఉద్యోగిగా ఉంటూ విప్ నోటీసులో ఎలా సంతకం చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల అధికారికి ఫిర్యాదు..: ఈ విషయంపై షఫీవుల్లా ఎన్నికల అధికారి వినాయకంకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కౌన్సిలర్ ఇంటికి అతికించిన విప్ పత్రంలో నా ప్రమేయం లేకుండా నా సంతకం చేయడంతోపాటు మా ఇంటి డోర్ నంబర్, నా సెల్ నంబర్‌ను వేశారని పేర్కొ న్నారు. పరిశీలిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. తనపేరు రాసి ఉన్న నోటీసును కూడా ఎన్నికల అధికారికి చూపించారు.