‘ముచ్చుమర్రి’ని పూర్తి చేయాలి | muchumarri should be complete | Sakshi
Sakshi News home page

‘ముచ్చుమర్రి’ని పూర్తి చేయాలి

Oct 20 2016 12:00 AM | Updated on May 29 2018 4:26 PM

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

– వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి 
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు ప్రాణప్రదమైన ముచ్చుమర్రి ఎత్తిపోతలపై పాలకులు ప్రసంగాలు చేయడం మినహా ఆచరణలోకి తేవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు సీమ రైతాంగానికి వెన్నెముకలాంటిదని అభివర్ణించారు. చిత్తశుద్ధితో ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేస్తే కర్నూలు, కడప జిల్లాల లక్షా డెభ్బైఐదు వేల ఎకరాలు (స్థిరీకరించిన ఆయకట్టు) సస్యశ్యామలం అవుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement