డ్రైవర్లు ఏకాగ్రత పెంచుకోవాలి : ఎంవీఐ రమేష్ | Motor vehicle inspector ramesh instructions to drivers | Sakshi
Sakshi News home page

డ్రైవర్లు ఏకాగ్రత పెంచుకోవాలి : ఎంవీఐ రమేష్

Jul 16 2016 6:55 PM | Updated on Sep 29 2018 5:26 PM

వ్యసనాలు, నిర్లక్ష్యం వీడి డ్రైవర్లు ఏకాగ్రత పెంచుకుని, ప్రమాదాల నివారణకు పాటుపడాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) రమేష్ ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు.

అనంతపురం న్యూసిటీ : వ్యసనాలు, నిర్లక్ష్యం వీడి డ్రైవర్లు ఏకాగ్రత పెంచుకుని, ప్రమాదాల నివారణకు పాటుపడాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) రమేష్ ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం డిపోలో జరిగిన ప్రమాద రహిత వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మెకానికల్ విభాగం కండీషన్ కల్గిన బస్సులను డ్రైవర్లకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్‌ఎం చిట్టిబాబు మాట్లాడుతూ డ్రైవింగ్‌లో పరిణతి సాధించినప్పుడు ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందన్నారు.

రాష్ట్రంలో అధిక కిలోమీటర్లు తిప్పిన ఘనత అనంతపురం రీజియన్‌కే దక్కిందని, ఇది కార్మికుల కృషి ఫలితమేనని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం జీ వెంకటేశ్వరరెడ్డి, అనంతపురం డీఎం బాలచంద్రప్ప, ఏఓ శంకర్ రెడ్డి, సీఐలు గౌడ్, నరసింహులు, కంట్రోలర్ పీసీకే స్వామి, కార్మిక సంఘాల నాయకులు రామిరెడ్డి, గోపాల్, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement